ప్రస్టేషన్ : కుక్కను రాడ్డుతో కొట్టి.. వైర్ తో ఉరేసి లాక్కెళ్లాడు

ప్రస్టేషన్ : కుక్కను రాడ్డుతో కొట్టి.. వైర్ తో ఉరేసి లాక్కెళ్లాడు

తమిళనాడులోని మధురైలో ఒక వీధికుక్కను ఇనుప పైపుతో దారుణంగా కొట్టి మెటల్ వైర్‌తో లాగినందుకు 32 ఏళ్ల పళనియప్పన్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కరుంబలై ప్రాంతంలోని సంగం రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.  జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం మరియు 428 IPC సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేయబడింది.

2023 జనవరి 03వ తేదీ కరుంబలైలో వీధికుక్క కాళ్లను మెటల్ వైర్‌తో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు  పళనియప్పన్. దీనిని చాలా మంది స్థానికులు తప్పుబట్టారు. కుక్కను రక్షించడానికి కూడ  ప్రయత్నించారు. కానీ పళనియప్పన్ కుక్కకు రేబిస్ ఉందని, వీధికుక్క కొన్ని కోళ్లను చంపిందని పళనియప్పన్ అబద్దం చెప్పి కుక్కను అలాగే ఈడ్చుకెళ్లాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

ఈ ఘటనపై జంతు సంరక్షణ బోర్డు గౌరవ సభ్యురాలు మురుగేశ్వరి అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పళనియప్పన్ పై జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం (PCA) సెక్షన్ 11 (1) (a), జంతువుకు హాని కలిగించినందుకు IPC సెక్షన్ 428 కింద కేసు నమోదు చేశారు. గాయపడిన కుక్కకు ప్రభుత్వ పశువైద్యశాలలో చికిత్స అందించారు.