ఇవాళ్టితో ప్రధాని మోడీ ఏడాది పాలన పూర్తయింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పార్టీ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మోడీ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోడీ ఆధ్వర్యంలో ఇండియా పవర్ ఫుల్ ఇండియాగా దూసుకెళ్తుందని కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మోడీని ప్రశంసించారు. ఇంగ్లీష్ లో మోడీకి కొత్త నిర్వచనం చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్.
‘మోడీ పేరులో ఒక మంత్రం ఉంది. M-motivational(ప్రేరణ) ఇండియాను మోడీ మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాడు అలాగే అందరినీ ప్రేరేపిస్తాడు. O- Opportunity(అవకాశం) దేశంలో దాగి ఉన్న అవకాశాలను బయటకు తీసుకొస్తాడు. D- Dynamic leadership(డైనమిక్ నాయకత్వం) ‘డైనమిక్ నాయకత్వం’ కోసం .I- Inspiration(స్ఫూర్తి) భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ తమకు స్ఫూర్తినిచ్చారు‘ అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
