పంజాగుట్ట,వెలుగు: మెరుగైన సమాజ నిర్మాణానికి జర్నలిస్టులు కృషి చేయాలని ప్రముఖ మెజీషియన్సామల వేణు పేర్కొన్నారు. తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ఫోరం క్యాలెండర్‌ను మున్నూరు కాపు యూత్ఫోర్స్స్టిక్కర్లను ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా జర్నలిస్టులు వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, సమాజ సమస్యలను భుజాలపై వేసుకుని కుటుంబాలను సైతం మరిచిపోయి పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటే మరింత మెరుగైన సమాజ నిర్మాణానికి పాటుపడతారని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, తెలంగాణ మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, సీనియర్జర్నలిస్టు తులైల శ్రీనివాస్, పీఎల్ఎన్పటేల్,టీఎంకేజేఎఫ్హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు పగడాల అరుణ్‌కుమార్, తుడి జనార్దన్, వేల్పుల శ్రీనివాస్, వీరాంజనేయులు, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు మేనేజింగ్ట్రస్టీ ఆకుల వి.పాండు రంగారావు, ట్రస్టీలు మంద సూర్య ప్రకాశ్, నిమ్మ శంకర్తదితరులు పాల్గొన్నారు.
