బాసర ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వ్యాపార సంఘాల మహాధర్నా

బాసర ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వ్యాపార సంఘాల మహాధర్నా

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వ్యాపార సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చారు. సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజేష్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేష్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు అమ్మవారి క్షేత్రంలోని దుకాణాలు, ఆటోలు, రెస్టారెంట్ లు మూసివేశారు. ధర్నాలో బాసర గ్రామస్తులతో పాటు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ధర్నాతో నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద మెయిన్ రోడ్డుపై అమ్మవారి భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో బైంసా-నిజామాబాద్ మధ్య ట్రాఫిక్ స్తంభించింది. రేంజర్ల రాజేష్ ను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర బంద్ కి బీజేపీ ముథోల్ నియోజకవర్గ ఇంచార్జ్ మోహన్ పటేల్ మద్దతు తెలిపారు. రేంజర్ల రాజేష్ ను అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లని అవమానపర్చేలా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.