- మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి: వివేక్ వెంకటస్వామి
- -రామకృష్ణాపూర్, ఇందారంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
- ఉగాది పండుగ సందర్భంగా ఆలయాల్లో పూజలు
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్బిలాల్మసీదులో, జైపూర్మండలం ఇందారం జామ మసీదులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందు, తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజాన్ వేడుకలు ప్రజల ఐక్యతను చాటిచెబుతాయని, ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి నిదర్శనమన్నారు.
రంజాన్సందర్భంగా చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్దుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమని, వారందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రభుత్వం ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటుందని, రంజాన్‌మాసంలో ఇఫ్తార్ విందులతోపాటు ఈద్‌కా తోఫా అందిస్తోందని తెలిపారు.
చెన్నూరులో రూ.50 లక్షలతో షాదీఖానా నిర్మిస్తున్నామని, రామకృష్ణాపూర్‌లోని ఈద్గాకు ప్రహరీ మంజూరు చేశామన్నారు. సింగరేణి భూమి కేటాయించి రూ.30 లక్షల నిధులతో కబరస్థాన్నిర్మిస్తామని, చెన్నూరు నియోజకవర్గ పరిధిలో పేద ముస్లిం మహిళలకు 400 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
మూడో పవర్ ప్లాంట్, ఫేజ్-2 కోల్మైన్తో ఉపాధి అవకాశాలు
జైపూర్‌లోని సింగరేణి థర్మల్పవర్కేంద్రంలో 800 మెగావాట్ల మూడో యూనిట్ తోపాటు రామకృష్ణాపూర్ఓపెన్కాస్ట్ఫేజ్-2 మైన్త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి వివేక్తెలిపారు. వీటితో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. బీఆర్ఎస్హయాంలో సింగరేణిలో ఒక్క కొత్త బొగ్గు గనిని తవ్వలేదని విమర్శించారు. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు కోసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న వేలంలో సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని, తాను సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి వేలంలో సింగరేణి పాల్గొనేందుకు పర్మిషన్ఇప్పించినట్టు చెప్పారు.
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపు కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇందారం మసీదు ప్రాంగణంలో వాటర్షెడ్డును ప్రారంభించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఇందారంలోని శివాలయం, రామకృష్ణాపూర్‌లోని విజయగణపతి ఆలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొని పూజలు చేశారు. కలెక్టర్‌కుమార్ దీపక్, డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట క్యాంపు ఆఫీసులో ఉగాది వేడుకలు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసులో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పూజల హరికృష్ణతో పాటు నాయకులు పాల్గొన్నారు.
