
హన్వాడ, వెలుగు: భారీ వానలతో మహబూ బ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ హేమసముద్రం చెరువుకు గండి పడింది. దీంతో శనివారం ఉదయం నుంచి తహసీల్దార్ కృష్ణానాయక్, ఎంపీడీఓ యశోద మరమ్మతు పనులు చేయించారు. సాయంత్రం కలెక్టర్ విజయేందిర బోయి ట్రాక్టర్ పై అధికారులతో వెళ్లి చెరువును పరిశీలించారు. అక్కడికి చేరుకునేందుకు రోడ్డంతా బురదమయంగా ఉండడంతో ట్రాక్టర్ పై వెళ్లాల్సి వచ్చింది. నీటితో నిండి అలుగులు పారే చెరువులపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.