ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌‌ సిస్టమ్‌‌ అప్‌గ్రేడేషన్‌ కు రైల్వే శాఖ ఆమోదం

ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌‌ సిస్టమ్‌‌ అప్‌గ్రేడేషన్‌ కు రైల్వే శాఖ ఆమోదం
  • మహబూబ్‌‌నగర్‌‌ – సికింద్రాబాద్​– మేడ్చల్‌‌ రూట్‌‌లో పనులు

హైదరాబాద్​సిటీ, వెలుగు : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్‌నగర్– -సికింద్రాబాద్– -మేడ్చల్ సెక్షన్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్‌గ్రెడేషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడానికి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకోన్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 125 కేవీ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌ సిస్టమ్‌ను 225 కేవీ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. 

రూ. 285.01 అంచనా వ్యయంతో దాదాపు 141 కిలోమీటర్ల మేర పనులు జరగనున్నాయని రైల్వే శాఖ తెలిపింది. మహబూబ్‌నగర్–-సికింద్రాబాద్–-మేడ్చల్ సెక్షన్ దేశంలోని ముఖ్యమైన హై-డెన్సిటీ నెట్‌వర్క్ మార్గాలలో ఒకటని, ఈ కొత్త సిస్టమ్‌ కారణంగా రైళ్ల కార్యకలాపాలకు మరింత స్థిరమైన, సమర్థవంతమైన విద్యుత్ సరఫరా లభిస్తుందని అధికారులు తెలిపారు. దీనివల్ల రైళ్లు సేవలు, సరకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా సాగుతాయని చెప్పారు.