ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కల్వకుర్తి, వెలుగు: దళితులు ఆత్మ గౌరవంగా బతికేందుకే  రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ ప్రవేశ పెట్టిందని  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం చారకొండ మండల కేంద్రంలో  వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం రూ. 3.32 కోట్లతో నిర్మించిన కేజీబీవీ బిల్డింగ్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తనకు అవకాశం వస్తే తెలంగాణ గురుకులాల్లో మళ్లీ స్టూడెంట్​గా చదవాలని కోరుకుంటానన్నారు. ‘దళిత బంధు’ పైలెట్ ప్రాజెక్టు కింద 269 మందికి శాంక్షనైనా రూ.27 కోట్లతో 112 కార్లు, 139 ట్రాక్టర్లు 18 గూడ్స్ వెహికల్స్​యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో  మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే దేశ వ్యాప్తంగా గిరిజన బంధు, బీసీ బంధును అమలు చేసే నేత కేసీఆర్​అన్నారు. ప్రభుత్వ విఫ్​ గువ్వల బాలరాజు, ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​, జడ్పీ వైస్​చైర్మన్​బాలాజీ సింగ్  డీసీసీబీ ప్రెసిడెంట్​నిజాం పాషా, అడిషనల్​కలెక్టర్​మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. 

అన్నం లేక ఇబ్బందులు..

దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించారని, పలువురు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి మీటింగ్​పెట్టారు.. కానీ.. మీటింగ్​కు వచ్చిన వారికి బుక్కెడు అన్నం పెట్టలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1గంటవరకే  అన్నం అయిపోవడంతో పలువురు ఇబ్బంది పడ్డారు. కొందరు వంట గిన్నె మూతలో అన్నం తినగా, మరికొందరు కడుపు మాడ్చుకుని వెళ్లిపోయారు.  

పట్టణాల అభివృద్ధికి ఫస్ట్​ ప్రయారిటీ

ఎక్సైజ్ మంత్రి  శ్రీనివాస్ గౌడ్

మక్తల్, వెలుగు:  పట్టణాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఫస్ట్​ప్రయారిటీ ఇస్తోందని  ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మున్సిపాలిటీలో టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్​రూ.5 కోట్లతో చేపడుతున్న​పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో ని ఫస్ట్​వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అన్ని పార్టీల లీడర్లు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మాదాసి కురువ సంఘం లీడర్లు ఎమ్మెల్యే నివాసంలో మంత్రిని కలిసి తమకు ఎస్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలని వినతి పత్రం ఇచ్చారు.  మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, మాజీ టీఎస్​ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నర్సింహగౌడ్, రాజేశ్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

నయా రజాకార్ల పాలనను తరిమికొట్టాలె 

బీజేపీ నేత ఆచారి

కందనూలు, వెలుగు: వందల మంది బలిదానంతో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన కుక్కలు చింపిన విస్తరిలా మారిందని బీజేపీ నేత తల్లోజు ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో నయా రజాకర్ల పాలనను తరిమి కొట్టాలంటే  బీజేపీ శ్రేణులు యుద్ధమే చేయాల్సి వస్తుందని, సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా శనివారం తిమ్మాజీపేట మండలం చేగుంట, గొరిట, తిమ్మాజీపేట, ఆవంచ, బుద్ధ సముద్రం, నేరళ్లపల్లి గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. హాజరైన ఆచారి టీఆర్ఎస్​సర్కార్​పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాక ముందుకు గోచీబట్టకు గతిలేనోళ్లు కొందరు టీఆర్ఎస్​లో చేరి వందల, వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్​ను తిట్టినోళ్లు మంత్రులు, ఉద్యమం చేసినోళ్లు రోడ్డున పడ్డారని చెప్పారు.  నియోజకవర్గ ఇన్​చార్జి  దిలీపా చారి, సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, కొండ నాగేశ్, విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

అప్పులు చేసి పనులు చేసినం.. బిల్లులిస్తలేరు..

పెద్దమందడి, వెలుగు: గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేస్తే.. వాటికి ఇంకా బిల్లులు రాలేదని సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో ఎంపీపీ మేఘారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమందడి, గట్ల ఖానాపూర్ సర్పంచ్​లు వెంకటస్వామి, వెంకటేశ్​మాట్లాడుతూ..  చేసిన పనులకు నెలలు గడుస్తున్నా బిల్లులు వస్తలేవని ఎంపీపీకి వివరించారు. ఆఫీసర్లను అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సాగదీస్తున్నారని వాపోయారు. విద్యుత్​ఓల్టేజీ, పింఛన్ల సమస్యలపై సర్పంచ్​లు మండిపడ్డారు.  జిల్లా రైతుసమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.