ఢిల్లీ ప్రోగ్రామ్ కి కంబాలపల్లి వాసికి ఆహ్వానం

ఢిల్లీ ప్రోగ్రామ్ కి కంబాలపల్లి వాసికి ఆహ్వానం

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన రేపల్లె షణ్ముఖరావుకు ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్​లో నిర్వహించే 'ఎటం' కార్యక్రమానికి ఆహ్వానం అందింది. పదో తరగతి చదివి సాధారణ మెకానిక్ గా జీవిస్తున్న షణ్ముఖరావు పాతికేళ్లుగా వినూత్న ఆవిష్కరణలు చేపడుతూ పలు పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఉద్యాన్ ఉత్సవ్-2026లో పత్తి సహా ఇతర పంట పొలాల్లో కలుపును తొలగించేందుకు ఉపయుక్తంగా ఉండే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో అభివృద్ధి చేసిన 'మోనోవీల్ మ్యాన్ రైడింగ్ పవర్ వీడర్’ యంత్రం అందరినీ ఆకర్షించింది.

ఈ ఆవిష్కరణకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవవర్మ, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా ఉత్తమ ఆవిష్కరణ కర్త పురస్కారాన్ని ఇటీవల అందుకున్నారు. తన ఆవిష్కరణల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధి ప్రయాస్ రూ.10 లక్షల గ్రాంటును పొందారు. కాగా, రాష్ట్రపతి భవన్​లో జరిగే 'ఎటం' కార్యక్రమానికి తనకు ఆహ్వానం రావడం ఎంతో ఆనందంగా ఉందని షణ్ముఖరావు  అన్నారు.