మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ నెల 4న ఒకే రోజు 44 కాన్పులు జరిగాయని సూపరింటెండెంట్ రామ్ కిషన్ తెలిపారు. శనివారం హాస్పిటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాన్పు జరిగిన 44 మంది గర్భిణులు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన వారన్నారు.
కాన్పుల్లో జన్మించిన 44 మంది పిల్లల్లో 25 మంది మగ, 19 మంది ఆడ పిల్లలు ఉన్నారని తెలిపారు. కాన్పుల్లో నార్మల్ డెలివరీలు 23 , సిజేరియన్లు 22 జరిగాయని వివరించారు. లో బర్త్ వెయిట్ ఉన్న వారిని ఎస్ఎన్సీయూలో అడ్మిట్ చేసినట్లు చెప్పారు. ఒకే రోజు 44 కాన్పులకు వైద్యం అందించిన డాక్టర్లను ఆయన అభినందించారు.
