మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు : సర్పంచ్, వార్డు మెంబర్ క్యాండిడేట్లుగా బరిలో ఉన్న క్యాండిడేట్లు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే బ్యాలెట్ పేపర్లలో ఉన్న గుర్తును చూపిస్తే.. ఓటర్లు గుర్తించగలరో లేదోనన్న అనుమానంతో... ఏకంగా గుర్తులకు సంబంధించిన వస్తువులనే తమ వెంట తీసుకెళ్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మణికొండలో బీజేపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న శారదకు ఫుట్‌బాల్ గుర్తు, 9వ వార్డు స్థానానికి పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ భార్గవికి స్టవ్ గుర్తు, 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్న భాస్కర్‌కు స్టూల్ గుర్తు కేటాయించారు. దీంతో ముగ్గురు క్యాండిడేట్లు ఆయా గుర్తులకు సంబంధించిన వస్తువులతో ఓటర్లను కలుస్తున్నారు.
