- మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మే 1న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 100 ఐటీ, నాన్-ఐటీ, ఫార్మా కంపెనీలు ఈ మేళాలో పాల్గొని అర్హత గల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.
10వ తరగతి ఫెయిల్ అయిన వారి నుంచి పీజీ, బీ.టెక్, ఫార్మా అభ్యర్థుల వరకు ఉమ్మడి జిల్లా యువత అంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. సుమారు 10వేల మంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొంటారని, ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు సాయంత్రం నియామక పత్రాలను అందజేస్తారని వివరించారు.
