మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో పాకిస్థాన్ లింక్స్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో పాకిస్థాన్ లింక్స్

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ యజమానులు స్థానిక వ్యాపారవేత్తలు, హవాలా కార్యకలాపాలతో సంబంధం లేకుండా పాకిస్థాన్‌లో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. బెట్టింగ్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. తాజా వివరాల ఆధారంగా గ్లోబల్ మనీలాండరింగ్ నిరోధక ఏజెన్సీల సహకారం కోరే అవకాశం ఉందని అన్నాయి.

దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రమోట్ చేసిన కంపెనీ కొత్త వినియోగదారులను నమోదు చేసుకోవడానికి, వినియోగదారు ఐడీలను సృష్టించడానికి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండర్ చేయడానికి ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఈ కుంభకోణం విలువ ఇప్పటికే రూ. 5వేల కోట్లకు చేరుకుందని అంచనా వేయగా.. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అది మరింత పెరగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ వివాహం ఈ ఏడాది ప్రారంభంలో యూఏఈలో జరిగింది. ఈ వేడుకకు ఆయన రూ. 250 కోట్ల ఖర్చు చేసినట్టు తేలింది. ఈ ఈవెంట్ కోసం మేనేజ్మెంట్ కంపెనీకి హవాలా మార్గంలో నిర్వాహకులు పెద్ద మొత్తంలో చెల్లించినట్టు ఈడీ గుర్తించింది. ఆ తర్వాత UAE, పాకిస్తాన్‌లలో ఆరోపించిన హవాలా కార్యకలాపాలు, వారి సంబంధాల వివరాలపై అనుమానులు వ్యక్తం చేసింది. ఇదే విధమైన పోర్టల్‌ను నడుపుతూ మధ్యప్రాచ్య దేశాలకు, పాకిస్తాన్‌కు మనీ లాండరింగ్ చేసినందుకు దాదాపు ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ హవాలా ఆపరేటర్లు అనుమానితులుగా ఉన్నారు. చంద్రకర్, అతని సహచరులు దాదాపు 70 షెల్ కంపెనీలను ఆఫ్‌షోర్ ఖాతాలకు మనీలాండర్ చేయడానికి ఉపయోగించారని ఈడీ ఆరోపించింది.

Also Read :- వీడెవండీ బాబూ.. రాత్రిపూట సీసీ కెమెరాలను ఎత్తుకెళ్తున్నాడు

శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హాలతో సహా మొత్తం 17 మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చంద్రకర్ వివాహానికి, గత సంవత్సరం సెప్టెంబర్‌లో జరిగిన కంపెనీ సక్సెస్ పార్టీకి హాజరు కావడం, ప్రదర్శన ఇచ్చారని ఈడీ వర్గాలు తెలిపాయి. “పెళ్లికి హాజరైనందుకు, ప్రదర్శన ఇచ్చినందుకు సెలబ్రిటీలు భారీ మొత్తంలో నగదును పారితోషికంగా స్వీకరించారు. ఈ డబ్బు నేరం ద్వారా వచ్చింది. కావున వీరూ  బాధ్యులు కావచ్చు. పెళ్లిలో డజనుకు పైగా సెలబ్రిటీలు పాల్గొన్నారు.  వారు వీడియోలలో కనిపిస్తున్నారు” అని వివరించింది.