వీడెవండీ బాబూ.. రాత్రిపూట సీసీ కెమెరాలను ఎత్తుకెళ్తున్నాడు

వీడెవండీ బాబూ.. రాత్రిపూట సీసీ కెమెరాలను ఎత్తుకెళ్తున్నాడు

నల్గొండ పట్టణంలో అర్థరాత్రి సమయంలో దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ వన్ లో సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. శ్రీనగర్ కాలనీలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయం వెనుక ఉన్న ఓ ఇంట్లో తెల్లవారుజామున సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లాడో దుండగుడు. ఈ విషయం ఉదయం గమనించిన ఇంటి యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ALSO READ: మనకు రావేంటి ఇలాంటి ఐడియాలు .. ట్రాఫిక్‌లోనే కూరగాయలు తరిగేసుకుంది

వారం రోజుల్లో శ్రీనగర్ కాలనీలో మూడు ఇళ్లల్లోని సీసీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల చోరీలతో కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. చోరీ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎవరైనా చోరీ కోసం వస్తే.. బంగారం, వెండి వస్తువులు, డబ్బు లేదా విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. కానీ.. నల్గొండ పట్టణంలో దొంగలు సీసీ కెమెరాలను ఎత్తుకెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.