21న హైదరాబాద్ లో గో మహాధర్నా

21న హైదరాబాద్ లో గో మహాధర్నా

హైదరాబాద్: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్,  గో సేన ఫౌండేషన్ సంయుక్తంగా ఈనెల 21న ఇందిరా పార్క్ వద్ద గో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు యుగ తులసి ఫౌండేషన్,  టీటీడీ పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్. గోమాత హత్యలు నివారించాలని చేస్తున్న తమ ప్రయత్నానికి స్వామీజీలు, పీఠాధిపతులు రావాలని పిలుపునిచ్చారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన సభ్యులు.. ఎవరు వచ్చినా రాకపోయినా గోవధ నివారించే చట్టాలు వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

జాతీయ ప్రానిగా  ప్రకటించాలంటే ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహా ధర్నా రోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు జరగనున్నాయని,  త్వరలో నిజాం కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రాణాలైనా అర్పిస్తాం గోమాతను రక్షించుకుంటామని,  అవసరమైతే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామన్నారు. సమావేశంలో తులసి ఫౌండేషన్ ప్రతినిధులు చంద్ర స్వామి, బాలకృష్ణ స్వామి, రాజగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.