ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపారవేత్త మహాజన్ జలంధర్ గుప్తా ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక వాసవిమాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడి పోస్టు కోసం ముగ్గురు పోటీలో ఉండడంతో నిర్వాహకులు ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌లో మొత్తం 160 మంది సభ్యులు పాల్గొనగా అత్యధికంగా 90 ఓట్లు వచ్చిన మహాజన్ జలంధర్ గుప్తాను అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా జలంధర్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
లక్సెట్టిపేట అధ్యక్షుడిగా చెట్ల రమేశ్
లక్సెట్టిపేట, వెలుగు: ఆర్యవైశ్య సంఘం లక్సెట్టిపేట పట్టణ అధ్యక్షుడిగా చెట్ల రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని స్థానిక వైశ్యభవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్మాస్ కాంతయ్య, జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు తెలిపారు. నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గుండ బుచ్చన్న, రాజమౌళి, ఎం.సుధాకర్, ప్రభాకర్, నల్మాస్ శ్రీనివాస్, గడ్డం వికాస్, యు.వేణు, వొజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
