మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎంసీఎల్) అసిస్టెంట్ ఫోర్‌మన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 500.
విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ఫోర్‌మన్ (ఎలక్ట్రికల్) 150, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 350.
ఎలిజిబిలిటీ
అసిస్టెంట్ ఫోర్ మన్ (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): మెట్రిక్యులేట్ + ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. ఏడాది ట్రైనింగ్/ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 07.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 28.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ mahanadicoal.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాట్న్ (సీబీటీ)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్–ఏలో జనరల్ అవేర్నెస్/ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, పార్ట్–బిలో టెక్నికల్ నాలెడ్జ్ పై 80 ప్రశ్నలు 80 మార్కులకు ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.
