మంత్రి వివేక్‎కు మహానాడు నాయకుల విషెస్

మంత్రి వివేక్‎కు మహానాడు నాయకుల విషెస్

వికారాబాద్, వెలుగు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్‎లోని ఆయన నివాసంలో శనివారం వికారాబాద్​ జిల్లా మాల మహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలలకు సముచిత స్థానం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు.