మహారాజా అగ్రసేన్ జయంతికి రండి ..సీఎంకు అగర్వాల్ సమాజ్ ఆహ్వానం

మహారాజా అగ్రసేన్ జయంతికి రండి ..సీఎంకు అగర్వాల్ సమాజ్ ఆహ్వానం

బషీర్​బాగ్, వెలుగు: మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధులు సీఎం రేవంత్​రెడ్డిని ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో ఆయనను కలిశారు. ఈ నెల 22న సాయంత్రం శంషాబాద్‌‌‌‌‌‌‌‌లోని క్లాసిక్ కన్వెన్షన్–3లో మహారాజా అగ్రసేన్ 5,149వ జయంతిని జరుపుతున్నామని పేర్కొన్నారు. 

అగర్వాల్ సమాజ్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను సీఎంకు వివరించారు. సమయం కుదిరితే తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్త, సలహాదారులు బద్రి విశాల్ బన్సాల్, హరీశ్​గుప్త, సంజయ్ గుప్త తదితరులున్నారు.