Rajinikanth: కొత్తస్టోరీకి సూపర్ స్టార్ ఫిదా.. ‘మహారాజ’ డైరెక్టర్తో రజినీకాంత్ మూవీ?

Rajinikanth: కొత్తస్టోరీకి సూపర్ స్టార్ ఫిదా.. ‘మహారాజ’ డైరెక్టర్తో రజినీకాంత్ మూవీ?

స్క్రీన్ రైటర్, దర్శకుడు ‘నితిలన్‌ స్వామినాథన్‌’పేరు తెలుగు ఆడియన్స్ వినే ఉండుంటారు. అదేనండీ.. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ (Maharaja) డైరెక్టర్ ఇతనే. ఈ సినిమాతో తమిళ, తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు.. చైనీయులకు కూడా సుపరిచితమే! ఇప్పుడీ డైరెక్టర్ సూపర్ స్టార్తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.

‘మహారాజ’తో ప్రేక్షకుల్ని మెప్పించిన నితిలన్‌ స్వామినాథన్‌.. సూపర్ స్టార్ రజినీకాంత్తో సినిమా చేయున్నట్లు టాక్. ఇప్పటికే, రజనీకాంత్కు స్టోరీ చెప్పి.. ఒప్పించారని తమిళ సినీ వర్గాల సమాచారం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక నితిలన్‌ స్వామినాథన్‌ మూవీ స్టార్ట్ కానుంది. 

ఇదిలా ఉంటే..  డైరెక్టర్ నిథిలన్‌ స్వామినాథన్‌ మేకింగ్‌, రైటింగ్‌ స్టైల్‌ను సినీ ఆడియన్స్కు బాగా నచ్చాయి. మహారాజ విడుదలయ్యాక తనను ఎంతోమంది ప్రశంసించారు కూడా. కథ పాతదే అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, విజయ్ సేతుపతి నటన వెరసీ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. రూ.20 కోట్ల బడ్జెట్‌తో మహారాజ సినిమాను  తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో నిథిలన్ స్వామినాథన్ కి అత్యంత ఖరీదైన BMWకారును నిర్మాత అందించారు కూడా! దాంతో బాక్సాఫీస్ దగ్గర నిథిలన్‌ స్వామినాథన్‌ తదుపరి సినిమా కోసం ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి సూపర్ స్టార్ రజినీకాంత్తో ఎలాంటి మూవీ చేయనున్నాడా అనేది ఆసక్తిగా మారింది.

ఇకపొతే, మహారాజ చూసిన ర‌జినీకాంత్ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డంతో పాటు ద‌ర్శ‌కుడు నిథిల‌న్ స్వామినాథ‌న్‌ను త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలుచుకోని అభినందించాడు. ఇక రజినీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ ఏడాది క్రిందటే తన X పేజీలో షేర్ చేశాడు. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.