
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహారాష్ట్ర రైతులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి పేరుతో తమ రాష్ట్రంలో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి .. మహారాష్ట్ర లోని గడ్చిరెల్లి జిల్లా గోదావరి సరిహద్దు గ్రామాల రైతులు భూములు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసి తెలంగాణలో దశాబ్ధి ఉత్సవాలు జరుపుకోవడంపై సీఎం కేసీఆర్ పై మహారాష్ట్ర రైతులు మండి పడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర రైతులకు చెందిన విలువైన భూములు తీసుకొని, ప్రతి ఏటా వందలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయామన్నారు. తమను ఆదుకుంటామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదని మహారాష్ట్ర రైతులు విమర్శించారు.. ఈ క్రమంలో మహారాష్ట్ర రైతులు గడ్చిరెల్లి జిల్లా గోదావరి సరిహద్దు గ్రామాల రైతులు సిరోంచలో 43 రోజుల నుంచి మహారాష్ట్ర రైతులు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. మహారాష్ట్ర సీఎం రైతులకు అండగా ఉంటామని ప్రకటించి .. ముంపునకు గురైన రైతుల భూములకు 28 కోట్ల రూపాయిలు మంజూరు చేయడంతో రిలే నిరాహార దీక్షను ఈ రోజు ( జూన్ 7) విరమించి .. హర్షం వ్యక్తం చేసిన రైతులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కృతజ్ఞతలు తెలిపారు..