Zepto: ఎక్స్ పైరీ అయిన ప్యాకెట్లు.. బూజు పట్టిన పదార్థాలు.. జెప్టో లైసెన్స్ రద్దు

Zepto: ఎక్స్ పైరీ అయిన ప్యాకెట్లు.. బూజు పట్టిన పదార్థాలు.. జెప్టో లైసెన్స్ రద్దు

టెన్ మినట్స్ డెలివరీ అంటూ కస్టమర్స్ ను బాగా అట్రాక్ట్ చేసిన జెప్టో (Zepto) మెల్లగా షాకివ్వడం కూడా స్టార్ట్ చేసింది. హైజీనిక్ స్టోరేజ్ తో ఫ్రెష్ కూరగాయలు, పండ్లతో పాటు గ్రోసరీస్ ఆర్డర్ చేసిన పది నిమిషాలలో డెలివరీ చేస్తామని మంచి మార్కెట్ షేర్ సంపాదించిన ఈ సంస్థ.. తాజాగా ఫ్రెష్ అనే పదాన్ని పక్కన పెట్టి బూజు పట్టి.. కుళ్లిపోయిన వస్తువులను డెలివరీ చేసి కస్టమర్స్ కు షాకిచ్చింది. కస్టమర్లకు నాణ్యతలేని వస్తువులను డెలివరీ చేయడంతో ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సంస్థ జెప్టో లైసెన్స్ రద్దు చేసింది. 

మహారాష్ట్రలో జెప్టో ఆఫీస్ లలో ఆదివారం (జూన్ 1) సోదాలు నిర్వహించిన అధికారులు.. కిరణాకార్ట్ టెక్నాలజీ లైసెన్స్ ను సస్పెండ్ చేసింది. ముంబైలోని ధారావి ప్రాంతంలో ఉన్న జెప్టో ఆఫీసు లైసెన్స్  సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు  సేఫ్ అండ్ హైజీనిక్ ప్రాడక్ట్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జెప్టో.. నిబంధనలు పాటించకపోవడం లేదని ఫిర్యాదులతో  లేటెస్ట్ గా సోదాలు నిర్వహించి షాకిచ్చింది ఎన్ఐఏ.

ముంబైలో జరిగిన ఎన్ఐఏ  సోదాలలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.  చాలా ఫుడ్ ఐటెమ్స్ పైన బూజు పేరుకుపోవడం.. వస్తువులు, కూరగాయలు.. నిల్వ ఉన్న మురుగునీటి దగ్గర భద్రపరుస్తున్నారు. ఎలాంటి శుభ్రత లేకుండా .. నిల్వ ఉంచే స్థలంలో సరైన టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడం లేదు. కూరగాయలు, వస్తువులను తడిసిన చిత్తడి చిత్తడి ఉన్న ఫ్లోర్ లపైనే నిల్వఉంచుతున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ ఇచ్చిన సమాచారం మేరకు ముంబై ధారావిలోని జెప్టో వేర్ హౌజ్ పై దాడులు నిర్వహించారు అధికారులు. లైసెన్స్ ప్రకారం పాటించాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ ఉల్లంఘించినందున రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ హైజీనిక్ పదార్థాలు మెయింటైన్ చేస్తూ.. నిబంధనలు అన్ని పాటించే సమయం వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసిస్టెంట్ కమిషనర్ అనుపమ బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు. 

ముంబైలో జెప్టోపై సోదాలతో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలలో కూడా జెప్టో నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. మెట్రో నగరాలలో ఎక్కువ మొత్తంలో కస్టమర్స్ ఆర్డర్స్ ఇస్తున్న క్రమంలో.. మిగతా నగరాలలో ఎఫెక్ట్ కాకుండా చూసే ప్లాన్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు