నేను శివుడిని, నువ్వు పార్వతీదేవి అంటూ.. మహిళపై ఫేక్ బాబా అత్యాచారం.. బ్లాక్ మెయిల్..

నేను శివుడిని, నువ్వు పార్వతీదేవి అంటూ.. మహిళపై ఫేక్ బాబా అత్యాచారం.. బ్లాక్ మెయిల్..

ముంబైలో మాజీ నేవీ ఆఫీసర్, ఫేక్ బాబా అశోక్ ఖరాత్ ఉదంతం మరువక ముందే మహారాష్ట్రలో మరో ఫేక్ బాబా ఆగడాలు కలకలం రేపాయి. తనను తాను దేవుడిగా ప్రకరించుకున్న ఫేక్ బాబా మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయిచింది బాధితురాలు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని వసాయికి చెందిన రిషికేష్ అనే ఫేక్ బాబా 35 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన క్రమంలో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

రిషికేష్ వైద్య అనే వ్యక్తితో 2023లో తనకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడిందని.. ఆధ్యాత్మిక బోధనల ముసుగులో 2023 డిసెంబర్ లో పుణెలోని ఓ లాడ్జిలో మొదటిసారి తనను కలిశాడని.. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. అత్యాచారం చేయడమే కాకుండా తనను అశ్లీలంగా ఫోటోలు తీశాడని తెలిపింది బాధితురాలి. ఆ తర్వాత అశ్లీల ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది బాధితురాలు.

అంతే కాకుండా... బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది బాధితురాలు. రిషికేష్ తనతో మాత్రమే కాకుండా ఇతర మహిళలను కూడా వలలో వేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.