
టీం ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కరోనావైరస్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ టాస్క్‌ఫోర్స్ ద్వారా కరోనా సోకకుండా ఉండేందుకు ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కొన్ని పద్ధతులను ఆయుష్ చికిత్సా విధానం ద్వారా అందిస్తారు. అలా ఆయుష్ పద్ధతులను సిఫారసు చేయడానికి అనుభవజ్ఞులైన అధికారులతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆ రాష్ట్ర వైద్య విద్య మరియు ఔషధ విభాగం తెలిపింది. కరోనాకు వ్యతిరేకంగా నాలుగు ఆయుష్ సూత్రాలను ధృవీకరించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కలిసి పనిచేస్తున్నాయి.
దీని ఫలితాలు మూడు నెలల్లోపు వస్తాయని సిఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే, ఆయుర్వేద విభాగం ఎండీ, ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా తెలియజేశారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 33,053 కరోనా కేసులు నమోదుకాగా.. అందులో 1198 మంది చనిపోయినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.