టెన్త్, ఇంటర్ మెమోల్లో ‘ఫెయిల్’ ఉండదిక!

టెన్త్, ఇంటర్ మెమోల్లో ‘ఫెయిల్’ ఉండదిక!
  •     మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  •     10, 12 తరగతుల్లో అమలు

ఎగ్జామ్స్ టైమ్​వచ్చిందంటే చాలు… స్టూడెంట్లు భయపడిపోతుంటారు. పరీక్షలు రాసేదాకా ఎలా రాస్తామో? అని టెన్షన్ పడుతుంటారు. రాసినంక రిజల్ట్ ఎట్ల వస్తదో? అని ఆలోచిస్తుంటారు. తీరా రిజల్ట్స్ వచ్చినంక ఫెయిల్ ​అని తెలిస్తే తెగ బాధపడిపోతుంటారు. ‘అయ్యో… సోపతోళ్లేమో పాస్ అయిపోయారు. నేనే ఫెయిల్ అయిన’ అని డిప్రెషన్ కు గురవుతుంటారు. ఈ క్రమంలో కొంతమంది స్టూడెంట్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక నుంచి గిసోంటి బాధలుండొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్ (12వ తరగతి) మెమోల్లో ‘ఫెయిల్’ అనే పదం ఉండకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఏడాది నుంచే దీన్ని అమలు చేయాలని ఆదేశించింది. మరికొన్ని రోజుల్లో పదో తరగతి, ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఆ పరీక్షల్లో ఎవరైనా పాస్ కాకపోతే ఫెయిల్ అని మెమో ఇవ్వకుండా… దానికి బదులు ‘ఎలిజిబుల్ ఫర్ రీఎగ్జామ్స్’ అని ఇవ్వాలని తెలిపింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఇలా ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ స్టూడెంట్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లోనూ ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ‘‘ఎలిజిబుల్ ఫర్ రీఎగ్జామ్” అని, మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ‘ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్’ అని మెమో జారీ చేయాలని ఆర్డర్ ఇచ్చింది. ‘‘ఫెయిల్ అనే పదం నెగెటివ్ సెన్స్ ను ఇస్తోంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు లైఫ్​ లో ఫెయిల్ అయినట్టు కాదు. స్టూడెంట్స్ లో పాజిటివ్ ఓపీనియన్ పెంపొందించేందుకు, వారిని ఎంకరేజ్ చేసేందుకు మేం ఈ నిర్ణయం