సెలబ్రిటీల ట్వీట్లపై మహా సర్కార్ విచారణ

సెలబ్రిటీల ట్వీట్లపై మహా సర్కార్ విచారణ

రైతుల ఉద్యమంపై  సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై విచారణకు ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ నేత సచిన్ సావత్  ఫిర్యాదు మేరకు .. రైతుల నిరసనపై సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, లతా మంగేష్కర్ , పలువురు ప్రముఖులు చేసిన ట్విట్టర్ పోస్టులపై దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్  ఆదేశించారు. ప్రముఖుల ట్వీట్లపై దర్యాప్తునకు ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ సమర్థించారు.

అమెరికా పాప్ సింగర్ రిహానా, గ్రేటన్ థన భర్గ్ రైతుల నిరసనకు మద్దతుగా చేసిన ట్వీట్ల తర్వాత ఇండియా నుంచి పలువురు సెలబ్రిటీలు రైతు చట్టాలకు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే సెలబ్రిటీలందరూ అగ్రి చట్టాలను సమర్థిస్తూ ట్వీట్లు చేయడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందా? లేదా వేరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అని  కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు సచిన్ సావంత్ హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్  చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.