క‌రోనాతో వ్య‌క్తి మృతి.. తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లింపు

క‌రోనాతో వ్య‌క్తి మృతి.. తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లింపు

కోవిడ్ -19 తో మరణించిన ఓ 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ స‌భ్యులు తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లించారు. మ‌హారాష్ట్ర‌లోని పూణెలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పూణే నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ ఖానాపూర్ అనే గ్రామానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు ఇటీవ‌ల క‌రోనా సోకింది. వారిద్దరూ నార్హే గ్రామంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా.. ఆసుప‌త్రి సిబ్బంది చికిత్స నిమిత్తం వారిని 40,000 రూపాయలను డిమాండ్ చేసింది. అయితే ఆసుపత్రిలో వెంటిలేటర్ బెడ్‌లు ఖాళీగా లేక‌పోవడంతో ఆ ఇద్ద‌రిలో ఒకరికి మంచం నిరాకరించింది.

ఈ నేపథ్యంలో ఇద్దరు సోదరులు వైద్యుల‌ను సంప్ర‌దించ‌కుండానే ఖానాపూర్‌లోని తమ ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. వారిలో శ్వాస‌కోశ స‌మ‌స్య ఉన్న ఓ వ్య‌క్తి(40) ఆరోగ్యం క్షీణించి శుక్ర‌వారం మృతి దాడు. మృత‌దేహాన్ని త‌ర‌లించ‌డానికి అంబులెన్స్‌కు ఫోన్‌చేయ‌గా వారు స్పందించ‌క‌పోవ‌డంతో చేసేది లేక కుటుంబ స‌భ్యులు తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లించారు. వ్యాధి సోకిన మృతుడి సోదరుడు ప్ర‌స్తుతం నెహ్రూనగర్‌లోని జంబో ఆసుపత్రిలో చేరాడు