
మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కు కరోనా సోకింది. కాంగ్రెస్ నేత చవాన్ ప్రస్తుతం ఉద్ధవ్ కేబినెట్‌లో పీడ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు. మంత్రి తరచూ ముంబై నుంచి తన స్వగ్రామమైన మరఠ్వాడాకు వెళ్లి వస్తుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనకు వైరస్ సోకిందని… ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. ఎన్సీపీ నేత, గృహ నిర్మాణ మంత్రి అయిన జితేంద్ర అవద్ కూడా కరోనా సోకడంతో ఆయన రెండు వారాలపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు.