టీజీపీఎస్సీని సందర్శించిన మహారాష్ట్ర బృందం

టీజీపీఎస్సీని సందర్శించిన మహారాష్ట్ర బృందం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. రాధ నేతృత్వంలో వచ్చిన టీమ్.. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంతో సమావేశమైంది. 

రిక్రూట్‌మెంట్ విధానంలో తెలంగాణ అనుసరిస్తున్న సంస్కరణలు, ప్రామాణిక నిర్వహణ, నోటిఫికేషన్ల కాలపరిమితులను వారికి వెంకటేశం వివరించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ నియామక ప్రక్రియల సామర్థ్యం, పారదర్శకత, నాణ్యతను మెరుగుపరచేందుకు ఈ పర్యటన చేస్తున్నట్టు రాధ టీమ్ పేర్కొంది.