
ముంబై: కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నందున జైలులో ఉన్న 50 శాతం ఖైదీలను టెంపరరీగా విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సీరియస్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మాత్రం టెంపరరీ బెయిల్ లేదా పెరోల్ ఇవ్వకూడదని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు మార్చిలో చెప్పింది. దీంతో బోంబే హైకోర్టు జస్టిస్ఏఏ సయ్యద్, స్టేట్ హోం డిపార్ట్మెంట్అడిషనల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్ చహాండె, మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ఎస్ఎన్ పాండేలతో హై పవర్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో 35,239 మంది రిలీజ్ అవుతారని కమిటీ ఎక్స్‌పెక్ట్ చేసింది. సెంట్రల్ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో సుమారు 100 మంది ఖైదీలు, సిబ్బందికి, బైకుల్లా మహిళల జైలులో 54 ఏండ్ల ఖైదీకి కరోనా పాజిటివ్వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖైదీలను ఎప్పుడు విడుదల చేయాలనే నిర్దిష్ట సమయాన్ని కమిటీ చెప్పలేదు. సీరియస్కేసులలో, ఇండియన్పీనల్కోడ్(ఐపీసీ), మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్, మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్, అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్యాక్ట్, ప్రివెన్షన్ఆఫ్మనీ లాండరింగ్ యాక్ట్ వంటి స్పెషల్ యాక్ట్స్కింద అరెస్టు అయిన ఖైదీలను విడుదల చేయరు. స్పెషల్యాక్ట్స్కింద అరెస్ట్ అయిన ఖైదీలను కూడా విడుదల చేయాలని అడ్వకేట్ ఎస్‌బీ తాలేకర్ ఇచ్చిన రిప్రెజెంటేషన్‌ను కమిటీ రిజెక్ట్చేసింది. నేర తీవ్రత, నేర స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఏ తరగతి ఖైదీలను విడుదల చేయాలని కమిటీ నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.