
ముంబై: మరో లాక్‌డౌన్ వద్దనుకుంటే ప్రజలందరూ తప్పకుండా కరోనా రూల్స్‌ను పాటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ‘మేం మరోమారు లాక్‌డౌన్ పెట్టాలని అనుకోవడం లేదు. కాబట్టి దయచేసి ప్రజలంతా కరోనా నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఇప్పుడే పూర్తిగా సడలింపులు ఉండవు. అన్‌లాక్‌కు సంబంధించిన మార్గదర్శకాలను మేం జారీ చేశాం. వీటి అమలును స్థానిక పాలనా యంత్రాంగం చూసుకుంటుంది’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇంకో లాక్‌డౌన్ పెట్టాలని ప్రభుత్వం భావించడం లేదని.. ఇక నుంచి ప్రజల రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకుంటామని తెలిపారు. ముంబైలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వస్తే టీవీ, ఫిల్మ్ షూటింగ్స్‌కు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ టైమ్‌లో కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌తోపాటు పరిశ్రమల్లో పనిచేసే వారి బాగోగులను చూసుకున్నామని తెలిపారు. వారి హెల్త్‌డేటాను కూడా రికార్డు చేశామన్నారు.