మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో ఎన్​ కౌంటర్​.. నలుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర:  గడ్చిరోలి జిల్లాలో ఎన్​ కౌంటర్​.. నలుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు,మావోయిస్టులకు  మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు  హతమయ్యారు. మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమై   కవాండే,  నెల్లుండ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. 

మావోయిస్టుల దళాలకు...  సి60  సీఆర్ పీఎఫ్​   పోలీసుల మద్య కాల్పులు జరిగాయి.  ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో  పోలీసు బలగాలు సర్చ్ అపరేషన్ చేపట్టారు.  నలుగురు మావోల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  ఇంకా మహారాష్ట్ర.. ఛత్తీస్​ ఘడ్​ అటవీప్రాంతంలో సర్చ్​ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోంది. 

ALSO READ | కర్ణాటక హనగల్ గ్యాంగ్రేప్ కేసు..బెయిల్ తర్వాత నిందితుల ఊరేగింపు..మండిపడుతున్న జనం