కర్ణాటక హనగల్ గ్యాంగ్రేప్ కేసు..బెయిల్ తర్వాత నిందితుల ఊరేగింపు..మండిపడుతున్న జనం

కర్ణాటక హనగల్ గ్యాంగ్రేప్ కేసు..బెయిల్ తర్వాత నిందితుల ఊరేగింపు..మండిపడుతున్న జనం

గ్యాంగ్ రేప్లో నిందితులు..ఇంకా కేసు ముగియలేదు..బెయిల్ పై మాత్రమే వచ్చారు..అయినా ఏదో ఘనకార్యం సాధించినట్టు సంబరాలు.. కార్లు, బైకులతో ఊరేగింపు..గతేడాది కర్ణాటకలో సంచలనం సృష్టించిన హనగల్ గ్యాంగ్ రేప్ నిందితులు జైలునుంచి బెయిల్ పై విడుదలై సంబురాలు చేసుకున్నారు. ఏడుగురు నిందితులను స్వగ్రామంలో బెయిల్ తర్వాత విజయోత్స ర్యాలీ తీస్తున్న సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. 

2024లో కర్ణాటకలోని హవేరీ జిల్లాలో సంచలనం సృష్టించిన హనగల్ గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు నిందితులు గురువారం (మే22) బెయిల్ పై విడుదలయ్యారు. కోర్టు విచారణ సమయంలో బాధితురాలు వారిని గుర్తించడంలో విఫలమైన తర్వాత హవేరి సెషన్స్ కోర్టు ఇటీవల వారికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులు ఆప్తాబ్ చందనకట్టి, మదర్ సాబ్ మందక్కి, సమీవుల్లా లాలనవర్, మహ్మద్ సాదిక్ అగసిమాని, షోయిబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సావికేరిలు జైలు నుంచి విడుదల అయిన తర్వాత వారి స్వగ్రామం అక్కి అలూర్ లో కార్లు, బైకులతో ర్యాలీ తీశారు.

బెయిల్ సంబురాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కోపంతో ఊగిపోతున్నారు. బెయిల్ పై వచ్చిన నిందితులు విజయోత్సవ ర్యాలీలు తీయడమేంటీ, రోడ్లపై ఈ న్యూసెన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

2024 జనవరిలో సంచలనం సృష్టించిన హనగల్ గ్యాంగ్ రేప్..   

2024 జనవరి8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగల్ లో ఓ లాడ్జీలో గ్యాంగ్ రేప్ జరిగింది.  కొంతమంది వ్యక్తులు లాడ్జీలో చొరబడి  మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటపై దాడి చేసి ఆ తర్వాత మహిళను ఎత్తుకెళ్లారు. సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

మొదట సాధారణ కేసుగా నమోదు చేశారు. పోలీసులు. మూడు రోజుల తర్వాత మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం తర్వాత  CrPC సెక్షన్ 164 కింద కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇంతకుముందే 12మందిని విడుదల చేశారు. తాజాగా గురువారం మరో ఏడుగురు నిందితులను బెయిల్ పై విడుదల చేశారు. బాధితురాలు నిందితులను గుర్తించకపోవడంతో హవేరి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితులు విజయోత్సవ ర్యాలీ తీయడంతో జనం మండిపడుతున్నారు.