బౌరాపూర్ .. తెలంగాణ శ్రీశైలం

బౌరాపూర్ .. తెలంగాణ శ్రీశైలం

భ్రమరాంబ కొలువైన చెరువును భ్రమరాంబ చెరువుగా, అక్కడ నివసిస్తున్న చెంచుల పెంటను(ఆవాసాన్ని) భ్రమరాపురంగా పిలుస్తారు. వ్యవహారికంలో అది బౌరాపూర్ అయింది. భ్రమరాంబను చెంచులు తమ ఆడ బిడ్డగా, మల్లన్నను అల్లుడిగా భావిస్తూ శివరాత్రికి బౌరాపూర్ లో పెద్ద జాతర నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా పలు నృత్యాలు చేస్తారు. భయంకరమైన వెం ట్రుకలు విరబోసుకున్న, గదను ధరించి న, నల్లని శరీరం, వంకర చూపు గల దిగంబర క్షేత్ర పాలకుడు 14వ శతాబ్దంలో అక్కడి దక్షిణ ద్వారంలో ఉండేవాడు. సరిగ్గా అలాం టి శిల్ప లక్షణాలున్న భైరవుడి విగ్రహం ఇప్పటికీ బౌరాపూర్ భ్రమరాంబ ఆలయానికి దక్షిణాన చెరువు గట్టు పై ఉంది. బౌరాపూర్ ఆలయానికి తూర్పున గణేశుడి విగ్రహం, మరో చోట హనుమంతుడి ప్రతిమ కనిపిస్తుం ది. ఈ విగ్రహాలను, భ్రమరాంబ ఆలయ వాస్తు శిల్ప శైలిని బట్టి ఇవి మలి చాళక్యుల కాలం మొదలుకొని రేచర్ల పద్మనాయకుల కాలం వరకు వెయ్యేళ్ల పాటు మనుగడలో ఉన్నట్లు అర్థమవుతుంది.

ఈ సమయంలో బౌరాపూర్ ఆలయ ప్రాంతం కాలాముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్య, వీరశైవ, శాక్తేయ మత శాఖల మఠాధిపతులకు, అనుయాయులకు ఆలవాలమైందని చెప్పొచ్చు . ఆయా కాలాల్లో ఇక్క డ మహాశివరాత్రి ఉత్సవాలు, జాగరణలు, సంబంధిత సాం స్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగేవి. ఆ టైంలో మహా క్షేత్రంగా విలసిల్లిన శ్రీశైలం వెళ్లటానికి నల్లమల మహారణ్యం లోని మార్గ మధ్యంలో నీటి వనరు ఉన్న ఏకైక క్షేత్రం బౌరాపూర్ మాత్రమే. అందువల్ల ఇది ఒక విడిది స్థలంగా కూడా వర్థిల్లింది. ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపున కృష్ణా నది దాటాక శ్రీశైలం మల్లన్న క్షేత్రం వస్తుంది. ఐదు దశాబ్దాల కిందట శ్రీశైలానికి రోడ్డు మార్గం వేశాక బౌరాపూర్ కి భక్తుల రాక తగ్గిపోయింది. భ్రమరాంబ, మల్లన్న కళ్యాణంలో భాగంగా దేవుడికి స్థానికంగా దొరికే సాం బ్రాణితో హారతి ఇస్తారు. తేనె, చెంచు గడ్డలను నైవేద్యంగా సమర్పిస్తారు . శివుడు, బౌరమ్మ (లేదా) గౌరమ్మ విగ్రహాల చుట్టూ దీపాలు పెట్టి గంట కొడుతూ అంతా క్షేమంగా, ఆరోగ్యం గా ఉండాలని, ఆహారం ప్రసాదిం చమని మొక్కుకుంటారు.

తర్వాత పశువులకు మేత వేయటం లేదా మేపటానికి అడవిలోకి తోలుకెళ్లటం వంటివి చేస్తారు. సాయంత్రం పూట అప్పాపూర్ గ్రామ సర్పంచ్ ఇంటి నుంచి ఎడ్ల బండిపై చెంచు పెద్దలు, పూజార్లు దేవదేవుళ్ల విగ్రహాలను బౌరాపూర్ గుడికి తరలిస్తారు. ఊరేగిం పులో చెం చులంతా ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు . బౌరాపూర్ ఆలయ సమీప భైరవు డి కి (వీరభద్ర స్వామికి) కళ్యాణం చేయటానికి ముందు ఎదుర్కొళ్లు కార్యక్రమం జరుగుతుంది.

వధువు తరపున ప్రభుత్వాధి కారులు, వరుడి తరపున బౌరాపూర్ , అప్పాపూర్ చెంచులు పెద్దలుగా వ్యవహరిస్తారు . అర్ధరాత్రి 12 గంటలకు బౌరాపూర్ ఆలయ ద్వార గోపురంపైన దీపం వెలిగించి దేవుణ్ని జ్యోతి దర్శనం చేస్తారు. తర్వాత ఆలయంలో శివుణ్ని, భ్రమరాంబను ఆరాధిస్తారు. విగ్రహాల పక్కనున్న పావుకోళ్లకు, నాగమ్మకు, ఆంజనేయ స్వామికి  ఆలయ పరిసరాల్లోని నంది, గణపతి, సాక్షి వీరభద్ర స్వాములకు పూజలు చేస్తారు. తెల్లవారిన తర్వాత మళ్లీ కల్యాణం జరిపి దర్శనాలను కొనసాగిస్తారు . మరుసటి ఉదయం స్వామివార్ల విగ్రహాలను శుద్ధి చేసి మళ్లీ గ్రామ సర్పం చ్ ఇంటికి చేర్చి, అక్కడ మేకను కోసి విందు చేసుకుంటారు . ఇది పూర్తిగా చెంచులు జరుపుకునే సంప్రదాయికమైన శివరాత్రి వేడుకగానే ఇంతకాలం కొనసాగిం ది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవడంవల్ల బౌరాపురం మరలా వెలుగులోకి వచ్చిం ది. వచ్చే మహా శివరాత్రినాటికి రోడ్డు కనెక్టివిటీ, ఇతర సదుపాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు .

 

                                                                                                                         ద్యావనపల్లి సత్యనారాయణ,

                                                                                                                                 హిస్టా రియన్‌‌