తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు

హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. జనవరి 3, 2026 నుంచి జనవరి 31, 2026 వరకు తెలంగాణలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 15 నుంచి 29 వరకూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని అభ్యర్థులకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.

ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ, గత బీఆర్ఎస్ సర్కారు ఆ నిబంధనను పక్కన పడేసింది. పదేండ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా రెండు సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహించగా.. తాజాగా 2026-టెట్ నోటిఫికేషన్ను ప్రకటించారు.

►ALSO READ | జూబ్లీహిల్స్ బైపోల్: కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి.. రేపు ( నవంబర్ 14 ) ఉదయం 11 కల్లా రిజల్ట్