శ్రీశైలం మహాక్షేత్రంలో 2026 ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ వాహన సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అన్ని ముందుగానే పూర్తి కావాలని ఆదేశించారు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు.
ఫిబ్రవరి 15న మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు,ప్రభోత్సవం, పాగా లంకరణ,కళ్యాణత్సవం జరగనున్నాయి. ఫిబ్రవరి 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం జరగనుంది.
11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జనవరి నెలాఖరుకి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు.
