మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ కన్నుమూత

మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ కన్నుమూత

మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ(89) కన్నుమూశారు.  గత కొన్నేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్లుగా పంచానికే పరిమితమైన ఆమె మార్చి 21న ముంబైలో తుదిశ్వాస విడిచినట్లు  మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్‌గాంకర్  తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన  ముంబైలోని గాంధీ స్మారక్ నిధికి గోకాని మాజీ చైర్‌పర్సన్. ఆమె తన బాల్యాన్ని గాంధీజీ స్థాపించిన వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిచింది. అక్టోబరు 2,  1955లో మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించారు.