శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా కమల్ హాసన్ నిర్మాణంలో ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ పెరియసామి దీనికి దర్శకుడు. 'గట్స్ అండ్ గోర్’ క్యాప్షన్‌తో దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. కాశ్మీర్‌లో రెండు నెలల లాంగ్ షెడ్యూల్‌తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ఇది శివ కార్తికేయన్‌కి 21వ సినిమా కాగా, కమల్ హాసన్ నిర్మిస్తున్న 51వ చిత్రం. ఇందులో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ కూడా భాగమైంది. మరోవైపు శివ కార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ మూవీ జులై 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.