'మహావతార్ నరసింహ' వసూళ్ల గర్జన.. రూ. 100 కోట్ల మార్కు దాటిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా రికార్డు!

 'మహావతార్ నరసింహ' వసూళ్ల గర్జన.. రూ. 100 కోట్ల మార్కు దాటిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా రికార్డు!

బాక్సాఫీస్ వద్ద 'మహావతార్ నరసింహ' ( Mahavtar Narasimha ) గర్జిస్తోంది. అంచనాలను మించి భారీగా వసూళ్లు రాబడుతోంది. పెద్ద సినిమాను సైతం బోల్తా కొట్టిస్తూ దూసుకెళ్తోంది. ఈ పౌరాణిక యానిమేటెట్ చిత్రానికి రోజు రోజు కు  పెరుగుతున్న స్పందన సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తుంది.  అశ్విన్ కుమార్ ( Ashwin Kumar ) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యానిమేటెడ్ మూవీ కేవలం 11 రోజుల్లో రూ. 100 కోట్ల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది.

గతంలో ఎన్నడూ లేనంతగా ఈ యూనిమేటెడ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  వీపరితమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.  ఈ ఘనత సాధించిన తొలి భారతీయ యానిమేటేడ్  పౌరాణిక చిత్రంగా నిలిచింది.  అన్ని భాషల నుంచి ఈ మూవీ భారీగానే కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇందులో సింహభాగం హిందీ వెర్షన్ నుంచి రాగా తరువాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఉన్నాయి.  

ALSO READ | Mahesh Babu: 'అతడు' రీ-రిలీజ్ హవా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే హౌస్ ఫుల్

ఇంతటి ఘన విజయాన్ని సాధించడం పట్ల హోంబలే ఫిల్మ్స్ సంతోషం వ్యక్తం చేసింది.  యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహ' మునుపెన్నడూ లేనంతగా కుటుంబాలను ఆకర్షించి, ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని విపరీతంగా సంపాదించిందని తెలిపింది. భారతీయ పురాణాలు కల్పితం కాదని, దేశ గొప్ప చరిత్ర అని తాను నమ్ముతానని మహావతార్ నరసింహ దర్శకుడు అశ్విన్ కుమార్ అన్నారు.

 

 భక్త ప్రహ్లాదుని భక్తిని, శ్రీమహావిష్ణువు క్రూరమైన నరసింహ రూపాన్ని శక్తివంతంగా దర్శకులు చిత్రీకరించారు.  మహావతార్ నరసింహ తన రెండవ సోమవారం (11 వ రోజు) రూ .8 కోట్లు వసూలు చేసింది, ఇది గత వారం విడుదలైన దానికంటే చాలా ఎక్కువ -. అజయ్ దేవగన్ యొక్క యాక్షన్ కామెడీ సన్ ఆఫ్ సర్దార్ 2 రూ .2.25 కోట్లు వసూళ్లు చేయగా..  సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి దిమ్రీ నటించిన రొమాంటిక్ డ్రామా ధడక్ 2 రూ .1.4 కోట్లు రాబట్టింది.  కొత్తవారు అహాన్ పాండే, అనీత్ పడా నటించిన మోహిత్ సూరి రొమాంటిక్ జాగర్ నట్ సయారా మూడో సోమవారం రూ.2.5 కోట్లు సాధించిన దానికంటే ఇది ఎక్కువ.. 

క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యానిమేటెడ్ 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని విదేశాల్లో కూడా రిలీజ్ చేశారు. ఉత్తర అమెరికాలో 3 లక్షల డాలర్లు  వసూళ్లు చేసింది. అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కూడా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ విదేశాల్లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.