Mahesh Babu: 'అతడు' రీ-రిలీజ్ హవా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే హౌస్ ఫుల్

Mahesh Babu: 'అతడు' రీ-రిలీజ్ హవా..  అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే హౌస్ ఫుల్

టాలీవుడ్‌లో ఇటీవల పాత చిత్రాల రీ-రిలీజ్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి క్లాసిక్‌ చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలోనే, సూపర్‌ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన ‘అతడు’ ( Athadu )సినిమాను ఆగస్టు 9న మరోసారి వెండితెరపై రీరిలీజ్ చేయనున్నారు.

2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ అప్పట్లో కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. మహేష్ బాబు స్టైలిష్ పర్ఫార్మెన్స్, పదునైన సంభాషణలు, మణిశర్మ సంగీతం ఈ సినిమాను ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు ఈ క్లాసిక్‌ను మరోసారి థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ : 'మహావతార్ నరసింహ' వసూళ్ల గర్జన.. రూ. 100 కోట్ల మార్కు దాటిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా రికార్డు!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు
‘అతడు’ రీ-రిలీజ్‌ కోసం మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించారు. ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే, అసలు హైలైట్ ఏమిటంటే... ఇంకా సినిమా విడుదల కాకముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో రిలీజ్‌కు వారం రోజుల ముందే రూ. కోటి మార్కును దాటి, ఇప్పటివరకు ఏ రీ-రిలీజ్ సినిమా సృష్టించని రికార్డును నెలకొల్పింది. 

 

ఒక్క ఓవర్సీస్‌లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘అతడు’ హవా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని  ప్రముఖ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమా రీ-రిలీజ్ హక్కులు ఏపీలో రికార్డు స్థాయిలో రూ. 3 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు సమాచారం.

 

ఈ భారీ స్పందన చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ తమ హీరో రేంజ్‌ను మరోసారి నిరూపించుకున్నారని చెప్పొచ్చు. ఆగస్టు 9న ‘అతడు’ విడుదలైన తర్వాత ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి. ఈ సినిమా కొత్త తరానికి ఒక గొప్ప క్లాసిక్‌ను పరిచయం చేయడమే కాకుండా, పాత అభిమానులకు మధురమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తుంది.