చిన్నచింతకుంట, వెలుగు : దేవరకద్రలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, తరగతి గదులు, కంప్యూటర్ రూమ్, డార్మిటరీలను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
అద్దె భవనంలో నడుస్తున్న పాఠశాలలో కొన్ని ఫ్యాన్లు పనిచేయకపోవడాన్ని గమనించిన కలెక్టర్, వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే రిఊనర్లు చేయించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసులుకు సూచించారు. అనంతరం స్థానిక పీహెచ్సీ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి అప్లికేషన్లు, భూముల సర్వే పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
