వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్,వెలుగు: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం నగరంలోని అర్బన్ తహసీల్దార్ ఆఫీస్​లో నిర్వహించిన స్పెషల్ ప్రజావాణికి ఆమె హాజరై వృద్ధులు, దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 

వాటిని వెంటనే క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. డీఆర్డీవో  నర్సింహులు, ఆర్డీవో నవీన్, డీడబ్ల్యూవో జరీనా బేగం, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు పాల్గొన్నారు.