సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి

సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
  •     మహబూబ్​నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు :  సాంకేతిక విద్యతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహబూబ్​నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. చదువుతోనే సమాజాభివృద్ధికి పునాది అని చెప్పారు. మహబూబ్​నగర్​లోని జహంగీర్ పీర్ ఐటీఐ కాలేజ్​లో మైనార్టీ సంక్షేమశాఖ నిధులు రూ.కోటితో నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా స్కిల్స్  కలిగిన వారి కొరత ఉందన్నారు. యువత నాణ్యమైన స్కిల్స్​ను సంపాదిస్తే.. ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందచ్చన్నారు. 

అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేశారు. లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతు వెన్నెముక..

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతు వెన్నెముక’ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్ గ్రామంలో సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని, గ్రామం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 

రైతుల కష్టాలను అర్థం చేసుకుని వారి పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితామధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్,  నాయకులు సుధాకర్ రెడ్డి, ధర్మ పూర్ నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మేఘారెడ్డి, రంగయ్య, అధికారులు  పాల్గొన్నారు.