
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టర్ విజయేందిర బోయిని మర్యాద పూర్వకంగా కలిశారు. పాలమూరు ప్రెస్ క్లబ్ కు మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానెల్ అభ్యర్థులు గెలుపొందారు.
కలెక్టర్ ను కలిసి ఆమెకు మొక్కను అందజేశారు. అధ్యక్షుడు నరేంద్ర చారి, ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు బసవరాజ్, కిశోర్, వెంకటేశ్వర్లు, రవికుమార్, రవీందర్ రెడ్డి, శివన్న, మణిప్రసాద్, సాయికుమార్, వెంకటేశ్, అంజిలయ్య, యాదయ్య, మోహన్ దాస్, సతీశ్, రవి, కృష్ణ, రాంకొండ, శాబుద్దీన్, అబ్దుల్ అహ్మద్ సిద్దిఖీ పాల్గొన్నారు.