తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్

తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్

తన తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. "మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ వ్యక్తిత్వం. మీలో నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. ఇంతకుముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీ కాంతి నాలో ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా... నువ్వే నా సూపర్ స్టార్" అంటూ మహేష్ ట్వీట్ చేశారు. 

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే  కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు.  అభిమానుల, ప్రముఖుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. ఆయన అస్థికలను మహేష్ కుటుంబ సభ్యులు కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.