
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)కి టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు.ఈ మూవీ తర్వాత విజయ్ మరో క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkatprabhu) డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విజయ్ 68 వ చిత్రంగా రాబోతున్నట్లు డైరెక్టర్ ముందే తెలిపారు.
లేటెస్ట్ గా విజయ్ 68వ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం దళపతి విజయ్ ను ఢీ కొట్టడానికి..CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Ms Dhoni)ని మెయిన్ విలన్ రోల్ లో తీసుకురావడానికి డైరెక్టర్ వెంకట్ ప్రభు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ధోనీ రీసెంట్ గా ధోని ఎంటర్టైన్మెంట్స్ లో LGM మూవీ చేశారు.
ఇక సినిమాల మీద ధోనీకి ప్యాషన్ ఉండటంతో..విజయ్ 68వ మూవీకి ఒప్పించే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారట డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇంకా ఆఫీసియల్ అనౌన్స్ మెంట్రా కపోయినప్పటికి..సోషల్ మీడియాలో ధోనీ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నట్టు, ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ఇంటరెస్టింగ్ వీడియోతో ఈ కేజ్రీ కాంబినేషన్‌ను ప్రకటించారు. ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి..2024 సమ్మర్ లో మూవీ రానున్నట్లు తెలిపారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్ గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే.