అంతా అతని మహిమే

అంతా అతని మహిమే

ఐపీఎల్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టు ఐపీఎల్ ప్రస్థానంలో రెండేళ్ళ నిషేధం తాలూకు అపశ్రుతి పక్కనబెడితే మిగతా తొమ్మిది సీజన్లలో మూడు సార్లు విజేతగా నిలిచింది. ఇంకో నాలుగు సార్లు ఫైనల్ దాకా వెళ్ళింది. మిగిలిన రెండు సార్లు కూడా ప్లేఆఫ్స్ చేరుకోగలిగింది. ఇంతటి సక్సెస్ మరే జట్టు కు లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రితం ఏడాది రీఎంట్రీలో కూడా మళ్ళీ పాత మ్యాజిక్ అందుకోగలిగింది. హోమ్ గ్రౌండ్ చెన్నైలో ఆడే అవకాశం లేకపోయికూడా ట్రోఫీ గెలుచుకోగలిగలిగిందీ

జట్టు బలాలు….

మహేంద్ర సింగ్ ధోనీ దిశానిర్దేశమే చెన్నై జట్టు ప్రధాన బలం. మామూలు ఆటగాళ్ళను కూడా ఛాంపియన్లుగా తీర్చిదిద్దే ఆల్కెమీ ఏదో అతనికి తెలుసు. అనామక పేసర్ దీపక్ చాహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీమ్ ఇండియా స్థాయికి ఎదిగేలా చేశాడు. అంబటి రాయుదు కెరీర్ పుంజుకుని మళ్ళీ ఇండియాకు ఆడుతున్నాడంటే అది కూడా ఆ కెప్టెన్ కూల్ చలవే. క్రితం ఏడాది రీఎంట్రీరీలో జట్టు కూర్పు విషయంలో అనుభవానికి పెద్ద పీట వేసింది ఈ జట్టు . ధోనీ తో బాటు హర్భజన్ , బ్రావో, తాహిర్, వాట్సన్ లాంటి ముప్పై ఐదేళ్ళు దాటిన వాళ్ళను ఎంపిక చేయడాన్ని చూసి జట్టు లో అందరూ ‘కురు వృద్ధులు‘ఉన్నారని, డాడ్స్ ఆర్మీ అని సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు. కానీ ఆ సీనియర్లతోనే సీను పండించి కప్ మళ్ళీ కైవసం చేసుకున్నాడు ధోనీ. ఒకసారి బ్రావో, మరో సారి రాయుడు, ఇంకో సారి వాట్సన్ ఇలా ప్రతి మ్యాచ్‌ లో ఒక్కో కొత్త  హీరో ‘ ను ఆవిష్కరింపజేసుకుంటూ సమష్ఠిగా రాణించడం చెన్నై జట్టు ప్రత్యేకత. ఈ ఏడాది ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ మోహిత్ శర్మను, మరో కొత్త కుర్రాడు (రితు రాజ్) ను మాత్రం చేర్చుకుని పాత కాంబినేషన్ పై తన నమ్మకాన్ని మళ్ళీ ప్రకటించాడుధోనీ. తుది జట్టు లో కూడా ఎంతో అవసరం ఉంటే గానీ మార్పులు చేయడు. కుదురైన జట్టు తో స్థిరమైన ఫలితాలు సాధించడమే చెన్నై విజయ రహస్యం.

బలహీనతలు….

లుం గీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గీడీ గాయపడటంతో జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం బలహీన పడుతుంది. మరో విదేశీ పేసర్ డేవిడ్ విల్లీ జట్టు లో ఉన్నా అతను క్రితం ఏడాది అంతగా రాణించలేదు. అందుకే పూర్తిగా ఇండియన్ పేసర్లు చాహర్, శార్దూల్ ఠాకుర్, మొహిత్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఎక్కువమంది సీనియర్లుండడం వల్ల వీరి ఫీల్డింగ్ లో చురుకుదనం లోపిస్తున్నది.

తుది జట్టు ఇలా ఉండొచ్చు….

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ధోనీ, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మిషేల్ శాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తా హిర్, మోహిత్ శర్మ