
సౌందర్య (Soundarya) తెలుగువారి అభిమాన నటి. తను ఈ భూమిపై జీవించింది కేవలం ముప్ఫై రెండేళ్లు మాత్రమే.అందులో నటిగా కొనసాగిన సంవత్సరాలు పన్నెండు. కానీ సౌత్ సినిమాపై ఆమె వేసిన ముద్ర కొన్ని సినిమా తరాలు. ఓ నటి టాప్ హీరోయిన్ అవ్వాలంటే గ్లామరస్‌గా కనిపించాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేయడమే కాదు..నటన అంటే కేవలం నటించడం కాదని, ఆ పాత్రగా మారిపోవడమని నిరూపించిన గొప్ప నటి సౌందర్య.
సౌందర్య మన తెలుగు టాప్ హీరోస్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరితో కలిసి నటించింది. కానీ, సౌందర్య..మహేష్ బాబు కలయికలో ఓ సినిమా మిస్ అయ్యిందని చాలా తక్కువ మందికి తెలిసు. మరి ఆ సినిమా ఏంటో..అది ఎలా మిస్ అయ్యిందో..తెలుసుకుందాం.
డైరెక్టర్ వై. వి. ఎస్. చౌదరి డైరెక్షన్ లో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన చిత్రం యువరాజు( Yuvaraju).ఈ మూవీలో సిమ్రాన్ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు ముందుగా సౌందర్య ను సంప్రదించారట. కానీ సౌందర్య మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కాబట్టి వీరి కాంబో సెట్ కాలేదట.
కానీ..సౌందర్య మాత్రం మహేష్ తో సినిమా అనగానే ఎంతో హ్యాపీ గా ఫీల్ అయ్యిందట. ఆ తర్వాత ఫోటో షూట్ కంప్లీట్ అయ్యాక..అసలు ఎందుకో కెమిస్ట్రీ అంతగా కుదరట్లేదు. మా ఇద్దరిని ఏ యాంగిల్‌లో చూసిన సూపర్ స్టార్‌కు అక్కలాగానే..కనిపిస్తున్నాని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్ కి చెప్పిందట.
ALSO READ : ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. ఫొటోలు వైరల్
అంతేకాకుండా..ఈ మూవీలో సిమ్రాన్ అయితే.. నాకంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని..ఆమెను సంప్రదించి.. స్టోరీ వినిపించండని..సౌందర్యనే సలహా ఇచ్చిందట. ఈ మూవీలో మహేష్ కు జోడీగా సిమ్రాన్, సాక్షి శివానంద్ లు హీరోయిన్స్ గా నటించారు.