Distributor Harish Sajja: స్టార్ డిస్ట్రిబ్యూటర్ ఆకస్మిక మృతి..మహేష్ బాబుకి ఫస్ట్ టైం ఆ రికార్డ్ ఇచ్చింది అతనే..

Distributor Harish Sajja: స్టార్ డిస్ట్రిబ్యూటర్ ఆకస్మిక మృతి..మహేష్ బాబుకి ఫస్ట్ టైం ఆ రికార్డ్ ఇచ్చింది అతనే..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.స్టార్ డిస్ట్రిబ్యూటర్ 'ఫికస్ డిస్టిబ్యూషన్ సంస్థ'అధినేత హరీష్ సజ్జ (Harish Sajja) ఆకస్మిక మరణం చెందారు.అమెరికాలో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే హరీష్ సజ్జా హార్ట్ అటాక్తో కన్నుమూశారు.ఓవర్ సీస్లో ఎన్నో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన హరీష్ సజ్జ అట్లాంటాలోని ఇంట్లో ఉండగా ఆకస్మకింగా గుండెపోటు రావడంతో..హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే  అయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

Also Read :The Goat Life OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్-మారిన ప్లాట్‌ఫామ్-స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

హరీష్ సజ్జ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంభ సభ్యులు శోకసంద్రంలో మునిపోయారు.హరీష్ సజ్జా ఆత్మకు శాంతి కలగాలని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,హీరోలు తమ సంతాంపం తెలిపారు.USAలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలలో ఒకటైన ఫికస్‌కు సంస్థకు మంచి గుర్తింపు ఉంది. 

హరీష్ సజ్జ సినిమా కెరీర్ విషయానైకి వస్తే..2006 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన రాఖీ మూవీతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ చిత్రం సక్సెస్ కావడంతో ఇక వెనుతిరిగి చూసుకోలేదు.వరుస సినిమాలతో యూఎస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా పేరుతెచుకున్నారు.ముఖ్యంగా 2008 నుండి 2016 వరకు దాదాపు ఒక దశాబ్దం పాటు యుఎస్‌లో అతిపెద్ద పంపిణీదారుగా క్రియాశీలకంగా వ్యవహరించారు. 

అదే తరుణంలో మహేష్ బాబు కెరీర్ లో అమెరికాలో ఫస్ట్ 1 మిలియన్ డాలర్స్ సాధించిన సినిమా దూకుడు.ఇది అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా దూకుడు నిలిచింది.అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,రోబో,రేస్ గుర్రం,1నేనొక్కడినే,ఆగడు,జనతా గ్యారేజ్ మొదలైన అనేక భారీ చిత్రాలను ఓవర్ సీస్ లో పంపిణీ చేసారు.