జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు.. ముఫాసా సినిమాకు మహేష్‌‌‌‌‌‌‌‌ బాబు వాయిస్ ఓవర్

జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు.. ముఫాసా సినిమాకు మహేష్‌‌‌‌‌‌‌‌ బాబు  వాయిస్ ఓవర్

‘జల్సా’ లాంటి పలు చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్‌‌‌‌‌‌‌‌ బాబు.. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ టైమ్ ఓ యానిమేషన్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డబ్బింగ్ చెప్పారు.  వాల్ట్ డిస్నీ  సంస్థ నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌లో దీనిని చూడబోతున్నాం. సోమవారం ఈ మూవీ తెలుగు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి..  నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది’ 

అంటూ మహేష్‌‌‌‌‌‌‌‌ చెప్పిన డబ్బింగ్‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ‘‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకేం కాదు టాకా..  భయపడకు’’ లాంటి డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ మహేష్‌‌‌‌‌‌‌‌ వాయిస్‌‌‌‌‌‌‌‌లో ఓ హాలీవుడ్‌‌‌‌‌‌‌‌ మూవీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినిపించడం సరికొత్త ఫీల్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేసింది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20న ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌,  తెలుగు, హిందీ, తమిళ భాష ల్లో విడుదల కానుంది.